మా ఊళ్లో అన్యమత ప్రచారం చేయొద్దు!
ABN , Publish Date - Feb 07 , 2026 | 05:16 AM
‘మా గ్రామంలో అందరూ హిందువులే. అన్యమత ప్రచారం చేసేందుకు ఎవరూ రాకండి. ఉల్లంఘించి వచ్చారంటే.. రూ.10 వేలు జరిమానా చెల్లించాలి.’ అంటూ..
ఉల్లంఘిస్తే రూ.10 వేలు జరిమానా
‘మా గ్రామంలో అందరూ హిందువులే. అన్యమత ప్రచారం చేసేందుకు ఎవరూ రాకండి. ఉల్లంఘించి వచ్చారంటే.. రూ.10 వేలు జరిమానా చెల్లించాలి.’ అంటూ నెల్లూరు జిల్లాలోని ఓ గ్రామస్థులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది. మనుబోలు మండలం యాచవరంలో గ్రామస్థులంతా ఈ విషయం లో ఓ తీర్మానం చేసుకుని, ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఇటీవల కొంత మంది గ్రామంలోకి వచ్చి ఇబ్బందులు పెట్టారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. విదేశీ మతాలు ప్రచారం చేసేందుకు వచ్చి, ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
- మనుబోలు, ఆంధ్రజ్యోతి