Share News

2న ముక్కావారిపల్లెలో ‘జీరామ్‌జీ’ ప్రారంభం

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:30 AM

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొట్టమొదట ప్రారంభించిన మన రాష్ట్రంలోనే వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ (వీబీజీరామ్‌జీ) పథకం కూడా..

2న ముక్కావారిపల్లెలో ‘జీరామ్‌జీ’ ప్రారంభం

  • ముఖ్య అతిథిగా కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి చౌహాన్‌

  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ హాజరు

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మొట్టమొదట ప్రారంభించిన మన రాష్ట్రంలోనే వికసిత్‌ భారత్‌ గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అజీవిక మిషన్‌ గ్రామీణ్‌ (వీబీజీరామ్‌జీ) పథకం కూడా జాతీయ స్థాయిలో మన రాష్ట్రంలోనే ప్రారంభించనున్నారు. జూలై 2న తిరుపతి జిల్లా కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం ముక్కావారిపల్లిలో కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. దీనికి సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌ హాజరుకానున్నారు.

Updated Date - Jun 27 , 2026 | 05:31 AM