Share News

వికసిత సంకల్ప బడ్జెట్‌

ABN , Publish Date - Feb 02 , 2026 | 05:55 AM

దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలపాలన్న బలమైన సంకల్పం ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ప్రస్ఫుటమవుతోందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

వికసిత సంకల్ప బడ్జెట్‌

  • ఏపీ అభివృద్ధికి ఊతం ఇస్తుంది: డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, ఫిబ్రవరి 1(ఆంధ్రజ్యోతి): దేశాన్ని ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలపాలన్న బలమైన సంకల్పం ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో ప్రస్ఫుటమవుతోందని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వికసిత భారత్‌ లక్ష్యాలు సాధించే లక్ష్యం వైపు ప్రజలను ఎలా అడుగులు వేయించాలనే దృక్పథం కేంద్ర బడ్జెట్‌లో కనపడిందన్నారు. కేంద్రం ఎంపిక చేసిన రేర్‌ ఎర్త్‌ కారిడార్లలో ఏపీ కూడా ఉండడం విలువైన ఖనిజాల వెలికితీత, తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. తీరప్రాంత మత్స్యకార సర్క్యూట్‌ బలోపేతం చేయడం, మహిళలు చేపలు పెంచుకునే అవకాశం, సుంకం లేకుండా చేపల పెంపకం వంటి నిర్ణయాలు మత్స్యకారులకు మేలు చేస్తాయన్నారు. ఉప్పాడ 100 రోజుల ప్రణాళికకు ఈ బడ్జెట్‌ ఊతం ఇస్తుందని, కొబ్బరి, జీడిపప్పు, కోకో రైతుల కోసం ప్రవేశపెట్టిన ప్రత్యేక పథకాల కోనసీమ ప్రాంతంలోని కొబ్బరి రైతులకు ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలోని జీడి రైతులకు ఊరటనిస్తుందన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 05:56 AM