Share News

వికసిత్‌ భారత్‌ లక్ష్యం

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:56 AM

2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్‌ ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు..

వికసిత్‌ భారత్‌ లక్ష్యం

  • బడ్జెట్‌పై కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ, బీజేపీ ఎంపీల వెల్లడి

న్యూఢిల్లీ/అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): 2047 నాటికి ‘వికసిత్‌ భారత్‌’ లక్ష్యాన్ని చేరుకోవడమే ధ్యేయంగా కేంద్ర బడ్జెట్‌ ఉందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమలశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. సోమవారం ఢిల్లీలోని తన నివాసంలో బీజేపీ ఏపీ ఎంపీలు దగ్గుబాటి పురందేశ్వరి, సీఎం రమేశ్‌, పాకా సత్యనారాయణలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై, బెంగళూరు-చెన్నై కారిడార్లు ఏపీ మీదుగా వెళ్లడం వల్ల రాష్ట్రంలోని పట్టణాల మధ్య కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ కేంద్ర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రాధాన్యం దక్కినట్లు తెలిపారు. జోగి రమేశ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ, బీజేపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబుది నిర్మాణాత్మక వైఖరి కాగా, జగన్‌ది విధ్వంసకర వైఖరి అని సీఎం రమేశ్‌ విమర్శించారు. కాగా, కేంద్రబడ్జెట్‌ను ఆంధ్రప్రదేశ్‌కు స్పష్టమైన దిశ చూపించేదిగా ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరు జయప్రకాశ్‌ నారాయణ విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో వ్యాఖ్యానించారు.

Updated Date - Feb 03 , 2026 | 03:56 AM