Highways Authority of India: నేటి నుంచి ‘వెస్ట్ బైపాస్’పై చలో చలో
ABN , Publish Date - Jan 15 , 2026 | 04:33 AM
విజయవాడ వెస్ట్ బైపాస్ సంక్రాంతి నుంచి అందుబాటులోకి రానుంది. అన్ని రకాల వాహనాలను ఒకవైపు అనుమతించేందుకు జాతీయ రహదారుల...
గుంటూరు, జనవరి 14(ఆంధ్రజ్యోతి): విజయవాడ వెస్ట్ బైపాస్ సంక్రాంతి నుంచి అందుబాటులోకి రానుంది. అన్ని రకాల వాహనాలను ఒకవైపు అనుమతించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ఏర్పాట్లు చేస్తోంది. గుంటూరు జిల్లా కాజ, చినకాకాని జంక్షన్ నుంచి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి మీదుగా చిన్న అవుటుపల్లి టోల్‌గేట్ జంక్షన్ వరకూ వెళ్లేందుకు వీలుగా ఒకవైపు రహదారిని ఎన్‌హెచ్‌ఏఐ సిద్ధం చేసింది. బుధవారం రహదారి పనులను క్షుణ్ణంగా ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు పరిశీలించారు. గుంటూరు నుంచి అమరావతి, గొల్లపూడి, విజయవాడ, హైదరాబాద్, ఏలూరు, ఉత్తరాంధ్ర వైపు వెళ్లే వారికి వీలుగా 15 నుంచి రాకపోకలను అనుమతిస్తున్నట్లు తెలిపారు. ఆమేరకు కాజ టోల్ గేటు వద్ద ఎన్‌హెచ్- 16, వెస్ట్ బైపాస్ అనుసంధాన పనులు ఒకవైపు పూర్తయినట్లు జాతీయ రహదారుల సంస్థ స్పష్టం చేసింది.