Share News

విజయవాడ - షార్జా విమానం రద్దు

ABN , Publish Date - Mar 04 , 2026 | 04:33 AM

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో విజయవాడ నుంచి షార్జాకు వెళ్లే విమానాన్ని రద్దు చేశారు.

విజయవాడ - షార్జా విమానం రద్దు

  • యుద్ధం ఆగేవరకు సర్వీసులు లేనట్టే!

గన్నవరం, మార్చి 3(ఆంధ్రజ్యోతి): ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల నేపథ్యంలో విజయవాడ నుంచి షార్జాకు వెళ్లే విమానాన్ని రద్దు చేశారు. షార్జా నుంచి విజయవాడకు మంగళ, శనివారాలు ఎయిరిండియా విమానం రాకపోకలు సాగిస్తోంది. మంగళవారం ఈ విమానంలో షార్జా నుంచి 172మంది విజయవాడ రావాల్సి ఉంది. యుద్ధం నేపథ్యంలో ఈ విమానాన్ని రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. అలాగే, విజయవాడ నుంచి 153 మంది షార్జా వెళ్లాల్లి ఉండగా, విమానాన్ని రద్దు చేస్తున్నట్లు ముందుగానే ఎయిరిండియా అధికారులు సమాచారం ఇవ్వడంతో ప్రయాణికులు టికెట్లను రద్దు చేసుకున్నారు. దాడులు ఆగే వరకూ విమాన సర్వీసులు ఉండకపోవచ్చని చెబుతున్నారు. గత శనివారం గన్నవరం నుంచి బయలుదేరిన విమాన ం షార్జా విమానాశ్రయాన్ని మూసివేసినట్లు సమాచారం అందడంతో 30 నిమిషాల్లోనే వెనుదిరిగి వచ్చింది.

Updated Date - Mar 04 , 2026 | 04:34 AM