నేడు, రేపు విజయవాడలో సుస్థిర నగరాల సదస్సు
ABN , Publish Date - Jun 01 , 2026 | 06:22 AM
పట్టణాలను పర్యావరణ అనుకూలంగా, కాలుష్య రహితంగా, వాతావరణ మార్పులను తట్టుకొనేలా మార్చే దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు..
కార్పొరేషన్, మే 31(ఆంధ్రజ్యోతి): పట్టణాలను పర్యావరణ అనుకూలంగా, కాలుష్య రహితంగా, వాతావరణ మార్పులను తట్టుకొనేలా మార్చే దిశగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు నిర్వహిస్తున్న ‘సస్టెయినబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ఇన్ ఇండియా కాన్ఫరెన్స్’కు విజయవాడ వేదిక కానుంది. విజయవాడ నగరపాలక సంస్థ (వీఎంసీ) సహకారంతో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంవోహెచ్‌యూఏ), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ (ఎన్‌ఐయూఏ) ఆధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో ఈ సదస్సు జరగనుంది.