Share News

ప్రయాణికులను కాపాడి.. మృత్యు ఒడిలో ఒరిగి!

ABN , Publish Date - Jan 27 , 2026 | 05:00 AM

ఆర్టీసీ అమరావతి ఎక్స్‌ప్రెస్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వేగంగా వస్తోంది.

ప్రయాణికులను కాపాడి.. మృత్యు ఒడిలో ఒరిగి!

  • విజయవాడ ఆర్టీసీ డిపో డ్రైవర్‌ నాగరాజు గుండెపోటుతో మృతి

విజయవాడ బస్‌స్టేషన్‌, జనవరి 26(ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ అమరావతి ఎక్స్‌ప్రెస్‌ సోమవారం ఉదయం హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వేగంగా వస్తోంది. బస్సు బయలుదేరినప్పటి నుంచే డ్రైవర్‌ కె.నాగరాజు (42) అస్వస్థతగా ఉన్నారు. తల తిరగడం, ఛాతీలో నొప్పితో ఇబ్బంది పడుతున్నారు. బస్సు చౌటుప్పల్‌ దగ్గరకు వచ్చేసరికి నాగరాజుకు తల తిరగటం, ఛాతీలో నొప్పి ఎక్కువయ్యాయి. గుండె పోటుగా భావించి, ఇక బస్సు తోలలేనని నిర్ణయించుకుని బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చాలని.. వెనక వచ్చే మరో బస్సు డ్రైవర్‌కు ఫోన్‌ చేసి చెప్పారు. బస్సులోని ప్రయాణికులకు కూడా ఇదే విషయం చెప్పారు. అటెండర్‌ను బస్సు వద్దే ఉంచి, ఆటోలో అతనొక్కడే సమీపంలోని ఆసుపత్రికి బయలుదేరి మార్గ మధ్యంలోనే ప్రాణాలు విడిచారు. నందిగామకు చెందిన నాగరాజు కానూరులో కుటుంబ సభ్యులతో ఉంటూ విజయవాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. నాగరాజుకు ఇద్దరు పిల్లలు. పాప దివ్యాంగురాలు. కుమారుడు ఐదో తర గతి చదువుతున్నాడు.

Updated Date - Jan 27 , 2026 | 05:00 AM