Share News

బంగారం దొంగిలించి మింగేశాడు!

ABN , Publish Date - May 15 , 2026 | 05:19 AM

విజయవాడ పోలీసులు ఓ చైన్‌ స్నాచర్‌ మింగేసిన బంగారు గొలుసును ఎనీమాతో బయటకు రప్పించారు!!

బంగారం దొంగిలించి మింగేశాడు!

  • ఎనీమాతో బయటికి రప్పించిన విజయవాడ పోలీసులు..

విజయవాడ, మే 14 (ఆంధ్రజ్యోతి): విజయవాడ పోలీసులు ఓ చైన్‌ స్నాచర్‌ మింగేసిన బంగారు గొలుసును ఎనీమాతో బయటకు రప్పించారు!! విజయవాడ ఎంజీ రోడ్డులోని బృందావన్‌ కాలనీలో 83 ఏళ్ల వృద్ధుడు ఒంటరిగా ఉంటున్నాడు. వైజాగ్‌ నుంచి ఉపాధి నిమిత్తం విజయవాడకు వచ్చిన ఓ యువకుడు బుధవారం ఉదయం అతడిని కత్తితో బెదిరించి మెడలో ఉన్న 40 గ్రాముల బంగారు గొలుసు లాక్కున్నాడు. దీంతో గొలుసు తెగి ఒక ముక్క అక్కడే పడింది. వృద్ధుడి ఫిర్యాదుపై కృష్ణలంక పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించి నిందితుడు ట్రైన్‌లో విశాఖకు పారిపోయినట్టు గుర్తించారు. వెంటనే అతని ఫొటో వైజాగ్‌లోని ఆర్పీఎఫ్‌ అధికారులకు పంపారు. వైజాగ్‌లో రైలు దిగగానే పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు. ఇక్కడి నుంచి ఒక బృందం వెళ్లి నిందితుడ్ని విజయవాడకు తీసుకొచ్చింది. పోలీసు విచారణలో నిందితుడు గొలుసును మింగేసినట్టు చెప్పాడు. దీంతో పోలీసులు అతనికి ఎనీమా చేయించారు. దీంతో లోపల ఉన్న 25.5గ్రాముల గొలుసు ముక్క బయటకు వచ్చేసింది.

Updated Date - May 15 , 2026 | 05:20 AM