నేడు పనిచేయనున్న పాస్‌పోర్ట్ కార్యాలయం
ABN , Publish Date - May 27 , 2026 | 05:36 AM
బక్రీద్ పర్వదిన సెలవు తేదీని 28వ తేదీకి మార్చిన దృష్ట్యా పాస్ పోర్ట్ కార్యాలయం బుధవారం(27వ తేదీ) యథావిధిగా పనిచేస్తుందని విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం..
28వ తేదీ స్లాట్లు నేటికి మార్పు
విజయవాడ సిటీ, మే 26, (ఆంధ్రజ్యోతి): బక్రీద్ పర్వదిన సెలవు తేదీని 28వ తేదీకి మార్చిన దృష్ట్యా పాస్ పోర్ట్ కార్యాలయం బుధవారం(27వ తేదీ) యథావిధిగా పనిచేస్తుందని విజయవాడలోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం మంగళవారం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ విషయాన్ని ఇప్పటికే దరఖాస్తుదారులకు ఎస్‌ఎంఎ్‌సల ద్వారా తెలియజేసినట్టు పేర్కొంది. పై మార్పును దృష్టిలో ఉంచుకుని పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, పోస్టల్ పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు, ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయాల్లో బుక్ చేసిన స్లా ట్లు మే 28 నుంచి 27వ తేదీకి మార్చినట్టు ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తుదారులు మార్పులను గమనించి, మార్పు చేసిన రోజుకు అంటే బుధవారం విచారణ కౌంటర్ల వద్దకు హాజరుకావాలని కోరారు. మరింత సమాచారం కోసం 1800-258-1200 (టోల్ ఫ్రీ)కి సంప్రతించవచ్చని ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయం తెలియజేసింది.