సాయికృష్ణ కుటుంబ సభ్యులకు అండగా నిలబడతాం
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:15 AM
సాయికృష్ణ కుటుంబానికి తాను అండగా ఉంటానని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
తూర్పు ఎమ్మెల్యే గద్దె హామీ.. కూటమి నేతల సహకారం: తల్లి విజయలక్ష్మి
విజయవాడ(కృష్ణలంక), జూన్ 18(ఆంధ్రజ్యోతి): సాయికృష్ణ కుటుంబానికి తాను అండగా ఉంటానని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. గురువారం ఉదయం కృష్ణలంకలోని సాయికృష్ణ మేనమామ ముళ్లపూడి నాగేశ్వరరావు ఇంటికి వచ్చి సాయికృష్ణ తల్లి విజయలక్ష్మితో ఆయన మాట్లాడారు. వారికి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో సీరియ్‌సగా ఉన్నారని, వెంటనే సీఐ నాగరాజును సస్పెండ్ చేయాలంటూ డీజీపీకి ఆదేశాలిచ్చారని గుర్తుచేశారు. ఈ కుటుంబానికి కచ్చితంగా న్యాయం జరుగుతుందన్నారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి మాట్లాడుతూ కృష్ణలంక పోలీసు స్టేషన్ నుంచి ఇద్దరు కానిస్టేబుల్స్ మార్కాపురం వెళ్లి తన కుమారుడిని అక్రమంగా స్టేషన్‌కు తీసుకొచ్చి నిర్భంధించి చిత్రహింసలు పెట్టి చంపేసి బాత్‌రూంలో పడేశారన్నారు. కూటమికి చెందిన నాయకులంతా తమకు పూర్తిస్థాయిలో సహకారం అందించారని తెలిపారు.