Share News

రేపు సముద్ర వనరుల వర్క్‌షాప్‌

ABN , Publish Date - Apr 28 , 2026 | 04:57 AM

సముద్ర వనరుల లాభాన్ని తీర ప్రాంత వర్గాలకు కూడా కొంత వాటా బదిలీ చేయడం అనే అంశంపై బుధవారం విజయవాడలోని...

రేపు సముద్ర వనరుల వర్క్‌షాప్‌

  • తీరప్రాంత వర్గాలకు లాభాల బదిలీపై బెజవాడలో నిర్వహణ

అమరావతి, ఏప్రిల్‌ 27(ఆంధ్రజ్యోతి): సముద్ర వనరుల లాభాన్ని తీర ప్రాంత వర్గాలకు కూడా కొంత వాటా బదిలీ చేయడం అనే అంశంపై బుధవారం విజయవాడలోని హోటల్‌ ఫార్చ్యూన్‌ మురళీలో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్టు రాష్ట్ర జీవవైవిధ్య మండలి చైర్మన్‌ నీలాయపాలెం విజయ్‌కుమార్‌ తెలిపారు. నేషనల్‌ బయోడైవర్సిటీ అథారిటీ, ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఆధ్వర్యంలో ఈ వర్క్‌షాప్‌ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా మూడు వేలకుపైగా ఉన్న జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలకు సముద్ర ఉత్పత్తుల ఎగుమతి సంపదలో న్యాయమైన వాటాను నేరుగా బదిలీ చేయడం ఈ వర్క్‌షాప్‌ లక్ష్యమన్నారు. పర్యావరణ, వాణిజ్య విధాన నిపుణులు, మత్స్యకార సంఘాలు, జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలు, సంబంధిత భాగస్వాములు హాజరై, దీనిపై చర్చించనున్నట్లు తెలిపారు.

Updated Date - Apr 28 , 2026 | 04:58 AM