ఉగ్రవాద మైనర్‌కు రిమాండ్ పొడిగింపు
ABN , Publish Date - May 01 , 2026 | 04:07 AM
బెనెక్స్ కామ్ గ్రూపు ద్వారా సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద సంస్థలకు చెందిన నేతల ప్రసంగాల వీడియోలను, ఉగ్రవాద సాహిత్యాన్ని ప్రచారం చేసిన కేసులో ...
విజయవాడ, ఏప్రిల్ 30(ఆంధ్రజ్యోతి): బెనెక్స్ కామ్ గ్రూపు ద్వారా సామాజిక మాధ్యమాల్లో ఉగ్రవాద సంస్థలకు చెందిన నేతల ప్రసంగాల వీడియోలను, ఉగ్రవాద సాహిత్యాన్ని ప్రచారం చేసిన కేసులో 16 ఏళ్ల బాలుడికి జువనైల్ జస్టిస్ బోర్డు రిమాండ్‌ను పొడిగించింది. అతనికి ఏడో తేదీ వరకు రిమాండ్‌ను పొడిగిస్తూ గురువారం ఆదేశాలు ఇచ్చింది. ప్రస్తుతం అతడు బాలల సంరక్షణ కేంద్రంలో ఉన్నాడు. అతని బెయిల్ పిటిషన్‌పై విచారణను నాలుగో తేదీకి వాయిదా వేసింది. ఈ బాలుడిని వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని కొత్తపేట పోలీసులు దాఖలు చేసి పిటిషన్‌పై విచారణ కూడా అదే తేదీకి వాయిదా పడింది.