Share News

ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు రిమాండ్‌ 22 వరకు పొడిగింపు

ABN , Publish Date - Jul 09 , 2026 | 03:59 AM

విజయవాడలోని కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఇన్‌స్పెక్టర్‌ నాగరాజుకు న్యాయస్థానం 22 తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించింది.

ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు రిమాండ్‌ 22 వరకు పొడిగింపు

విజయవాడ, జూలై 8 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని కృష్ణలంకకు చెందిన రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ఇన్‌స్పెక్టర్‌ నాగరాజుకు న్యాయస్థానం 22 తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించింది. ఈ కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న నాగరాజు రిమాండ్‌ బుధవారంతో ముగిసింది. దీంతో జైలు అధికారులు ఆయన్ను వర్చువల్‌గా విజయవాడ రెండో అదనపు జ్యుడిషియల్‌ మేజిస్ర్టేట్‌ కోర్టులో హాజరుపరిచారు. న్యాయాధికారి ఎస్‌.శ్రీకాంత్‌.. ‘మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా’ అని నాగరాజును ప్రశ్నించారు. తాను చెప్పాల్సింది ఏమీ లేదని నాగరాజు తల ఊపారు. అనంతరం 22 తేదీ వరకు నాగరాజుకు రిమాండ్‌ను పొడిగిస్తూ ఆదేశాలు ఇచ్చారు.

Updated Date - Jul 09 , 2026 | 03:59 AM