Share News

క్రికెట్‌లో లోకేశ్‌ గీ మనోహర్‌

ABN , Publish Date - Feb 23 , 2026 | 05:35 AM

మంగళవారం నుంచి విజయవాడలోని ఇం దిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శాసనసభ, శాసనమండలి సభ్యులకు క్రికెట్‌తో పాటు పలు క్రీడా పోటీలు జరగనున్నాయి.

క్రికెట్‌లో లోకేశ్‌ గీ మనోహర్‌

  • ఇరు జట్లకు కెప్టెన్లుగా మంత్రులు

  • రేపటి నుంచి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు

విజయవాడ (స్పోర్ట్స్‌), ఫిబ్రవరి 22(ఆంధ్రజ్యోతి): మంగళవారం నుంచి విజయవాడలోని ఇం దిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో శాసనసభ, శాసనమండలి సభ్యులకు క్రికెట్‌తో పాటు పలు క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రికెట్‌ పోటీల్లో పాల్గొనే జట్లకు మంత్రులు లోకేశ్‌, నాదెండ్ల మనోహర్‌ కెప్టెన్లుగా వ్యవహరించనున్నట్టు సమాచారం. మరోవైపు ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేందుకు పురుష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు మహిళా సభ్యులు సైతం ఆసక్తిగా ఉన్నారు. క్రికెట్‌ పోటీల్లో పాల్గొనే వారి సంఖ్య పెరిగితే మరో జట్టును ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఈ జట్టుకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారో చూడాలి. మరో జట్టు పెరిగితే ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ టీమ్‌ పేరుతో ఆయనే ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉందని తెలిసింది. క్రీడా పోటీల్లో గెలిచేందుకు ఇప్పటికే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ప్రాక్టీస్‌ కూడా మొదలు పెట్టినట్టు సమాచారం.

Updated Date - Feb 23 , 2026 | 05:38 AM