మంచి గాలి కోసం..
ABN , Publish Date - Apr 15 , 2026 | 06:19 AM
విజయవాడ నగరంలో వాయు కాలుష్యంపై పీసీబీ చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. గాలి నాణ్యతను పెంచడం కోసం వీసీఎం మిస్ట్ స్ర్పేయింగ్ మెషీన్లను రంగంలోకి దించింది.
ఇంటర్నెట్ డెస్క్: విజయవాడ నగరంలో వాయు కాలుష్యంపై పీసీబీ చాలా కాలంగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. గాలి నాణ్యతను పెంచడం కోసం వీసీఎం మిస్ట్ స్ర్పేయింగ్ మెషీన్లను రంగంలోకి దించింది. ప్రధాన రహదారులపై నీటిని చిమ్ముతోంది. గాలిలోకి నీటి తుంపర్లను వెదజల్లుతోంది. మొక్కలపై దుమ్ము ధూళిని వదిలిస్తోంది. ఒక్కోటి రూ.30 లక్షల ఖరీదు చేసే ఈ వాహనాలను వైసీపీ హయాంలోనే సమకూర్చుకున్నా మూలనపడేశారు. ‘ఆంధ్రజ్యోతి’ వీటిపై ప్రత్యేక కథనాన్ని రాసింది. ప్రత్యేక అధికారి లక్ష్మీశ ఆదేశాల మేరకు మొత్తం ఆరు సీఎన్‌జీ వాహనాలూ రోడ్డుపైకి వచ్చాయి. గాలి నాణ్యతే కాదు... ఈ మండు వేసవిలో ద్విచక్ర వాహనదారులకు అంతో ఇంతో ఈ వాహనాల వల్ల వేడి నుంచి ఉపశమనం కలుగుతోంది.
- విజయవాడ, ఆంధ్రజ్యోతి