Share News

కసిరెడ్డి, వాసుదేవరెడ్డిపై పీటీ వారెంట్‌ రిటర్న్‌

ABN , Publish Date - Aug 20 , 2026 | 04:48 AM

మద్యం రవాణా టెండర్లలో అక్రమాలకు సంబంధించి నమోదైన కేసులో సిట్‌ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు రిటర్న్‌ చేసింది.

కసిరెడ్డి, వాసుదేవరెడ్డిపై పీటీ వారెంట్‌ రిటర్న్‌

విజయవాడ, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): మద్యం రవాణా టెండర్లలో అక్రమాలకు సంబంధించి నమోదైన కేసులో సిట్‌ దాఖలు చేసిన పీటీ వారెంట్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు రిటర్న్‌ చేసింది. ఈ కేసులో కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, కారుమూరి సునీల్‌ను సిట్‌ అధికారులు నిందితులుగా చేర్చారు. అప్పటికే వారిని ఈడీ అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపింది. కొద్దిరోజుల క్రితం సిట్‌ అధికారులు వారిని పీటీ వారెంట్‌పై తీసుకొచ్చి విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. తర్వాత రాజశేఖర్‌రెడ్డి, వాసుదేవరెడ్డి హైకోర్టును ఆశ్రయించడంతో వారి రిమాండ్‌ చెల్లదని తీర్పు ఇచ్చింది. అధికారులు మరోసారి రెండు రోజుల క్రితం పీటీ వారెంట్‌ను దాఖలు చేశారు. దీన్ని కోర్టు రిటర్న్‌ చేసింది. కాగా, మద్యం కుంభకోణంలో నిందితులుగా ఉన్న కె.ధనుంజయరెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డి, బాలాజీ గోవిందప్ప విచారణ నిమిత్తం బుధవారం విజయవాడ ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. కోర్టు నుంచి సమన్లు అందిన తర్వాత విచారణకు హాజరు కావాలని న్యాయాధికారి ఎల్‌.తేజోవతి స్పష్టం చేశారు.

Updated Date - Aug 20 , 2026 | 04:50 AM