Share News

ప్రాణభయంతో విజయసాయి: కనపర్తి

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:30 AM

రాజ్యసభ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు.

ప్రాణభయంతో విజయసాయి: కనపర్తి

అమరావతి, ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యసభ మాజీ ఎంపీ, వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి ప్రాణభయంతో విలవిల్లాడుతున్నారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడున్నర వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారుడు ఎవరో తెలిపే సాక్ష్యాలు బయటపెడితే వైఎస్‌ వివేకాకు పట్టిన గతే నీకూ పడుతుందని.. విజయసాయిని జగన్‌ బెదిరించారని, అందుకే విజయసాయి ప్రాణభయంతో ఆందోళన చెందుతున్నారని అన్నారు. ఆ భయంతోనే సీఎం చంద్రబాబుపై నోటికొచ్చినట్లు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

Updated Date - Apr 27 , 2026 | 05:31 AM