Share News

మనమిత్ర వాట్సాప్‌ సేవలపై ప్రత్యేక డ్రైవ్‌: సీఎస్‌

ABN , Publish Date - Feb 21 , 2026 | 04:22 AM

రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అధికారులను ఆదేశించారు.

మనమిత్ర వాట్సాప్‌ సేవలపై ప్రత్యేక డ్రైవ్‌: సీఎస్‌

అమరావతి, ఫిబ్రవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రభుత్వ సేవలు ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మనమిత్ర వాట్సాప్‌ గవర్నెన్స్‌పై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టాలని పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వివిధ అంశాలపై కలెక్టర్లతో సమీక్షించారు. మనమిత్ర వాట్సాప్‌ సేవపై జిల్లాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. యూనిఫైడ్‌ ఫ్యామిలీ సర్వేను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా తీసుకున్న రుణాల్లో ఏప్రిల్‌లోగా అసలు చెల్లిస్తే... వడ్డీ మాఫీ చేసేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని చెప్పారు. రూ.260 కోట్ల అసలు, రూ.40 కోట్ల వడ్డీ వసూలు కావాల్సి ఉందని, రికవరీపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.


పీఎం సూర్యఘర్‌, కుసుమ్‌ వేగవంతం చేయాలి: సీఎస్‌

పీఎం సూర్యఘర్‌, పీఎం కుసుమ్‌ కార్యక్రమాలతోపాటు ఫీడర్‌ లెవల్‌ సోలరైజేషన్‌ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని సీఎస్‌ విజయానంద్‌ కోరారు. సచివాలయంలో శుక్రవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌లోనూ, విద్యుత్తు పంపిణీ సంస్థల సీఎండీలతో సమీక్షలోనూ సీఎస్‌ మాట్లాడారు. పీఎం సూర్యఘర్‌, కుసుమ్‌కు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని, దేశం మొత్తం కోటి సోలార్‌ రూఫ్‌ టాప్‌ల ఏర్పాటు లక్ష్యంగా ఉంటే రాష్ట్రంలోనే 20 లక్షల సోలార్‌ రూఫ్‌టా్‌పలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని సీఎస్‌ చెప్పారు.

Updated Date - Feb 21 , 2026 | 04:23 AM