Share News

ఏపీ ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈగా విజయానంద్‌ బాధ్యతల స్వీకరణ

ABN , Publish Date - Jun 04 , 2026 | 12:23 AM

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీ ఈపీడీసీఎల్‌) అల్లూరి జిల్లా సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా వై.విజయానంద్‌ బుధవారం బాధ్యతలను స్వీకరించారు.

ఏపీ ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈగా విజయానంద్‌ బాధ్యతల స్వీకరణ
బాధ్యతలు స్వీకరిస్తున్న వై.విజయానంద్‌

పాడేరు, జూన్‌ 3 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీ ఈపీడీసీఎల్‌) అల్లూరి జిల్లా సర్కిల్‌ సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌గా వై.విజయానంద్‌ బుధవారం బాధ్యతలను స్వీకరించారు. ఇన్నాళ్లూ ఇక్కడ ఎస్‌ఈగా పని చేసిన జీఎన్‌ప్రసాద్‌కు శ్రీకాకుళం బదిలీ కాగా, కోనసీమ అంబేడ్కర్‌ జిల్లాలో ఈఈగా పని చేస్తున్న వై.విజయానంద్‌కు పదోన్నతి కల్పించి స్థానిక ఎస్‌ఈగా నియమించారు. జిల్లాలో వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సేవలను అందించేందుకు కృషి చేస్తానని నూతన ఎస్‌ఈ విజయానంద్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయనకు స్థానిక టెక్నికల్‌ ఈఈ ఎల్‌సీహెచ్‌ పాత్రుడు, కమర్షియల్‌ డిప్యూటీ ఈఈ డి.భాస్కరరావు, ఏవో శ్యామలరావు, డివిజన్‌ ఈఈ వేణుగోపాల్‌, ఏఈఈలు, లైన్‌ ఇన్‌స్పెక్టర్లు, లైన్‌మన్‌లు సాదర స్వాగతం పలికి అభినందనలు తెలిపారు.

Updated Date - Jun 04 , 2026 | 12:23 AM