Share News

హాస్టల్‌ విద్యార్థినులకు హోటల్‌ భోజనం

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:16 AM

ఏజెన్సీ వంట గ్యాస్‌ సరఫరా చేయకపోవడంతో సోమవారం విజయనగరంలోని ఓ కళాశాల వసతిగృహంలో విద్యార్థినులు అవస్థలు పడ్డారు.

హాస్టల్‌ విద్యార్థినులకు హోటల్‌ భోజనం

విజయనగరం టౌన్‌, మార్చి16(ఆంధ్రజ్యోతి): ఏజెన్సీ వంట గ్యాస్‌ సరఫరా చేయకపోవడంతో సోమవారం విజయనగరంలోని ఓ కళాశాల వసతిగృహంలో విద్యార్థినులు అవస్థలు పడ్డారు. హాస్టల్‌ నిర్వాహకులు వారి కోసం ఓ హోటల్‌ నుంచి భోజనం తెచ్చి పెట్టారు. వంట మధ్యలో గ్యాస్‌ ఆగిపోయిందని హాస్టల్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ జగదీశ్వరి తెలిపారు. గత ఐదు రోజులుగా ఎన్‌వీఆర్‌ గ్యాస్‌ ఏజెన్సీ వద్దకు కాళ్లరిగేలా తిరుగుతున్నా ఒక్క గ్యాస్‌ బండను కూడా పంపిణీ చేయలేదన్నారు. ఈ విషయమై.. ఏజెన్సీ యజమానిని వివరణ కోరగా, తనకు గ్యాస్‌ కోసం లెటర్‌ ఇవ్వలేదని, ఇచ్చి ఉంటే పంపిణీ చేసేవారమని తెలిపారు.

Updated Date - Mar 17 , 2026 | 05:18 AM