Share News

ప్రశ్న రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలు మతపరమైన ఉగ్రవాదమే

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:05 AM

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌, నటుడు ప్రకాశ్‌రాజ్‌ హిందూమతంపై చేసిన వ్యాఖ్యలు మతపరమైన ఉగ్రవాదమేనని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు

ప్రశ్న రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌ వ్యాఖ్యలు మతపరమైన ఉగ్రవాదమే

  • రావణ్‌ను వైసీపీ సమర్థించడం అత్యంత దురదృష్టకరం: సాయిరెడ్డి

అమరావతి జూలై 8(ఆంధ్రజ్యోతి): యూట్యూబర్‌ ప్రశ్న రావణ్‌, నటుడు ప్రకాశ్‌రాజ్‌ హిందూమతంపై చేసిన వ్యాఖ్యలు మతపరమైన ఉగ్రవాదమేనని రాజ్యసభ మాజీ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. సమాజంలో ఇలాంటి మతపరమైన విద్వేషాలను రేకెత్తిస్తున్న రావణ్‌, ప్రకాశ్‌రాజ్‌ల చర్యలను వైసీపీ సమర్థించడం అత్యంత దురదృష్టకరమని బుధవారం ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ హిందుత్వంపై జరుగుతున్న దాడేనని అన్నారు. ఈ విద్వేషపూరిత ధోరణిని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని పిలుపు ఇచ్చారు. హిందూ సనాతన ధర్మాన్ని, సంస్కృతిని కించపరచేలా ప్రవర్తిస్తున్న వీరి వెనుక ఎవరున్నారనే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని వైసీపీ తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. విద్వేషాలను రెచ్చగొట్టేలా ఉన్న ఇలాంటి వ్యాఖ్యలను ‘మతపరమైన ఉగ్రవాదం’గానే పరిగణించాల్సి ఉంటుందన్నారు. ‘సమాజంలో శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా వ్యవహరిస్తున్న ఇటువంటి వ్యక్తులకు చట్టం వేసే శిక్షలు మాత్రమే సరిపోవు, సమాజం వీరిని పూర్తిగా వెలి వేసి తగిన బుద్ధి చెప్పాలి’ అని విజయసాయి పిలుపునిచ్చా రు. తెలుగు ప్రభుత్వాలతో పాటు కేంద్రం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించాలని, మతవిద్వేషాలను రెచ్చ గొట్టేవారిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.

Updated Date - Jul 09 , 2026 | 04:06 AM