Share News

సమాజాభివృద్దికి మహిళా సాధికారతే కీలకం

ABN , Publish Date - Mar 19 , 2026 | 05:01 AM

సమాజాభివృద్ధికి మహిళా సాధికారతే కీలకమని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ అన్నారు.

సమాజాభివృద్దికి మహిళా సాధికారతే కీలకం

  • జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌

శ్రీశైలం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): సమాజాభివృద్ధికి మహిళా సాధికారతే కీలకమని జాతీయ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ అన్నారు. బుధవారం శ్రీశైలం దేవస్థానం పరిపాలనా భవనంలో జిల్లాలోని వివిధ శాఖలకు సంబంధించిన అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ రహత్కర్‌ మాట్లాడుతూ మహిళలు, చిన్నారులు, శిశు సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాల అమలుపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా 550 జిల్లాల్లో ‘మహిళా జన్‌ సున్వాయ్‌’ (ప్రజా విచారణ) కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఐదు జిల్లాల్లో విజయవంతంగా అమలు చేసినట్టు చెప్పారు.

Updated Date - Mar 19 , 2026 | 05:01 AM