Share News

త్వరలో రాజకీయ పార్టీ

ABN , Publish Date - Aug 20 , 2026 | 03:21 AM

త్వరలో నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుమలలో ప్రకటించారు. శ్రీవారిని బుధవారం ఉదయం దర్శించుకున్న ఆయన..

త్వరలో రాజకీయ పార్టీ

  • వివరాలు విజయవాడలో ప్రకటిస్తా: విజయసాయిరెడ్డి

తిరుమల, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): త్వరలో నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్టు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తిరుమలలో ప్రకటించారు. శ్రీవారిని బుధవారం ఉదయం దర్శించుకున్న ఆయన ఆలయం ముందు మీడియాతో మాట్లాడారు. ‘ప్రజల తరఫున, ప్రజల కోసం, ప్రజల గొంతుకను చట్టసభల్లో వినిపించాలి. ఆ సదుద్దేశంతో లాయర్‌గా, ప్రజాప్రతినిధిగా ఒక రాజకీయ పార్టీని స్థాపించి, ఏపీలో సరికొత్త రాజకీయానికి శ్రీకారం చుట్టాలని శ్రీవారిని దర్శించుకున్నా. తిరుమలలో రాజకీయాలు మాట్లాడకూడదు. కాబట్టి నా తదుపరి రాజకీయ ప్రణాళికలను విజయవాడలో తెలియజేస్తా. ఎల్‌నినో ప్రభావం లేకుండా మంచి వర్షాలతో రైతులు సుభిక్షంగా ఉండాలని, ఆహారం కొరత లేకుండా చూడాలని శ్రీవారిని కోరుకున్నా’ అని విజయసాయిరెడ్డి తెలిపారు.

Updated Date - Aug 20 , 2026 | 03:22 AM