31 నుంచి విజ్ఞాన్ వర్సిటీలో బాల మహోత్సవ్
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:34 AM
చిన్నారుల్లో సృజనాత్మక నైపుణ్యాలను, ప్రతిభను వెలికి తీేసందుకు విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వర కు రాష్ట్రస్థాయిలో...
గుంటూరు (విద్య), జనవరి 27 (ఆంధ్రజ్యోతి): చిన్నారుల్లో సృజనాత్మక నైపుణ్యాలను, ప్రతిభను వెలికి తీేసందుకు విజ్ఞాన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వర కు రాష్ట్రస్థాయిలో విజ్ఞాన్ బాల మహోత్సవ్ 2కే 26ను నిర్వహిస్తున్నట్టు ఇన్‌చార్జి వీసీ డాక్టర్ కేవీ కృష్ణ కిషోర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్ యూనివర్సిటీలో నిర్వహించనున్న ఈ బాల మహోత్సవ్‌కు సంబంధించిన పోస్టర్లను సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కృష్ణ కిషోర్ మాట్లాడుతూ, చిన్నారులలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారికి సరైన వేదిక కల్పించడమే ఈ బాల మహోత్సవ్ ప్రధాన లక్ష్యమన్నారు. విద్యతో పాటు క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ ప్రతిభ కనబరిచే అవకాశాన్ని ఈ వేడుక కల్పిస్తుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రిజిరేస్టషన్ కోసం కోఆర్డినేటర్లు సీహెచ్ సాత్విక్ 73822 61632, బి.రోషిత 77998 74416 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.