Share News

విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఐటీఈపీ కోర్సుకు అనుమతి

ABN , Publish Date - Mar 10 , 2026 | 04:56 AM

గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నుంచి ప్రతిష్టాత్మకమైన ఇంటిగ్రేటెడ్‌...

విజ్ఞాన్స్‌ వర్సిటీలో ఐటీఈపీ కోర్సుకు అనుమతి

గుంటూరు(విద్య), మార్చి 9 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లా వడ్లమూడిలోని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీకి నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (ఎన్‌సీటీఈ) నుంచి ప్రతిష్టాత్మకమైన ఇంటిగ్రేటెడ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రామ్‌ (ఐటీఈపీ) కోర్సు ప్రారంభానికి అనుమతి లభించిందని వర్సిటీ ఇన్‌చార్జి, వైస్‌ చాన్స్‌లర్‌ ప్రొఫెసర్‌ కేవీ కృష్ణకిషోర్‌ సోమవారం తెలిపారు. ఎన్‌సీటీఈ నుంచి ఐటీఈపీ కోర్సును 2026-27 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు అనుమతి లభించిందని వివరించారు. ఈ అనుమతితో విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయం జాతీయ విద్యా విధానం (ఎన్‌సీఈపీ)-2020 అమలులో ముందంజలో నిలిచే విద్యాసంస్థలలో ఒకటిగా నిలిచిందన్నారు. ఐటీఈపీ కోర్సు నాలుగేళ్ల సమగ్ర అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుగా రూపొందించారని.. ఇందులో బీ.ఏ.బీ.ఎడ్‌., బీ.ఎ్‌ససీ.బీ.ఎడ్‌. వంటి రెండు ప్రధాన విభాగాలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.

Updated Date - Mar 10 , 2026 | 04:57 AM