Share News

‘‘విజ్ఞాన్‌’’ ప్రభంజనం

ABN , Publish Date - Apr 16 , 2026 | 04:45 AM

ఇంటర్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ బుధవారం తెలిపారు.

‘‘విజ్ఞాన్‌’’ ప్రభంజనం

గుంటూరు(విద్య), ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఇంటర్‌ ఫలితాల్లో విజ్ఞాన్‌ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్‌ బుధవారం తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం వడ్లమూడిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో శనివారం ఆయన మాట్లాడుతూ ఏపీ ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం ఫలితాల్లో తమ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు 985 మార్కులకు పైగా సాధించారని వెల్లడించారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో ఇద్దరు 466, ఏడుగురు 465, ఏడుగరు 464 మార్కులు సాధించారని తెలిపారు. అద్భుత ఫలితాలు సాధించిన విద్యార్థులను విజ్ఞాన్స్‌ విద్యాసంస్థల చైర్మన్‌ డాక్టర్‌ లావు రత్తయ్య ప్రత్యేకంగా అభినందించారు. ప్రణాళికాబద్థమైన విద్యాబోధనతో విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారని తెలిపారు. కార్యక్రమంలో వడ్లమూడి, గుంటూరు జూనియర్‌ కళాశాలల ప్రిన్సిపాల్స్‌ జె.మోహనరావు, వై.వెంకటేశ్వరరావు, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.

Updated Date - Apr 16 , 2026 | 04:46 AM