బెరైటీస్ సరఫరాలో అవినీతిపై 2వ రోజూ విచారణ
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:02 AM
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట మిల్లుల నుంచి ఓఎన్జీసీకి బెరైటీస్ (ముగ్గురాయి పౌడరు) సరఫరాలో అవినీతి జరిగిందన్న విషయమై..
ఓబులవారిపల్లె, జూన్ 16(ఆంధ్రజ్యోతి): తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె మండలంలోని మంగంపేట మిల్లుల నుంచి ఓఎన్జీసీకి బెరైటీస్ (ముగ్గురాయి పౌడరు) సరఫరాలో అవినీతి జరిగిందన్న విషయమై విజిలెన్స్ విచారణ మంగళవారం కూడా కొనసాగింది. ఏపీఎండీసీ పరిధిలో ఉన్న మిల్లుల యజమానులతో విజిలెన్స్ కమిటీ సభ్యులు సమావేశమయ్యారని చీఫ్ ప్రాజెక్టు ఆఫీసర్ గోపీనాథ్ తెలిపారు. ఏయే కంపెనీలు, ఏమేరకు ఓఎన్జీసీకి బైరెటీస్ సరఫరా చేశాయన్న విషయమై నివేదిక తయారు చేసి.. ఉన్నతాధికారులకు అందజేస్తారని తెలిపారు.