నేడు ఏపీ ఎన్‌జీజీవో ఎన్నికలు
ABN , Publish Date - Feb 08 , 2026 | 04:39 AM
ఏపీ ఎన్‌జీజీవో కార్యవర్గ ఎన్నికలు ఆదివారం విజయవాడలో జరగనున్నాయి. మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు ఆలపర్తి విద్యాసాగర్ సిద్ధమయ్యారు.
మరోసారి అధ్యక్షుడిగా నామినేషన్ వేయనున్న విద్యాసాగర్
విజయవాడ సిటీ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఏపీ ఎన్‌జీజీవో కార్యవర్గ ఎన్నికలు ఆదివారం విజయవాడలో జరగనున్నాయి. మరోసారి అధ్యక్షుడిగా పోటీ చేసేందుకు ఆలపర్తి విద్యాసాగర్ సిద్ధమయ్యారు. భారీ ర్యాలీ వెళ్లి నామినేషన్ దాఖలు చేసేందుకు సన్నాహాలు చేసుకున్నారు. 35 ఏళ్ల క్రితం జూనియర్ అసిస్టెంట్‌గా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన ఆయన ఎన్‌జీజీవోలో అంచెలంచెలుగా ఎదిగారు. 1992లో విజయవాడ నగర కార్యవర్గ సభ్యునిగా సంఘంలో చేరి, అనతి కాలంలోనే జిల్లా స్థాయి పదవులను అలంకరించారు. జిల్లా సంఘంలో సంయుక్త కార్యదర్శి, కోశాధికారిగా, 2005లో కార్యదర్శిగా, 2008లో అధ్యక్షుడిగా నియమితులయ్యారు. జిల్లా జేఏసీకి చైర్మన్‌గా ఆరు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. 2025 జనవరి 1న ఎన్‌జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2025 జూన్ 1న రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు.