Share News

ఏఐఎస్‌జీఈఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షుడిగా విద్యాసాగర్‌

ABN , Publish Date - Jan 28 , 2026 | 06:34 AM

ఆలిండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌జీఈఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు.

ఏఐఎస్‌జీఈఎఫ్‌ జాతీయ ఉపాధ్యక్షుడిగా విద్యాసాగర్‌

అమరావతి, విజయవాడ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): ఆలిండియా స్టేట్‌ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ (ఏఐఎస్‌జీఈఎఫ్‌) రాష్ట్ర అధ్యక్షుడు అలపర్తి విద్యాసాగర్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. మహారాష్ట్రలోని షిర్డీలో నిర్వహించిన 18వ జాతీయ మహాసభల్లో... విద్యాసాగర్‌ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ నెల 23 నుంచి 26 వరకు ఘనంగా జరిగిన ఈ మహాసభల ముగింపు సందర్భంగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 29 రాష్ట్రాల నుంచి హాజరైన వేలాది మంది ఉద్యోగ సంఘాల ప్రతినిధుల సమక్షంలో నూనత జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించారు. సుమారు 80లక్షల మంది ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే ప్రాధాన్యత కలిగిన జాతీయ ఉపాధ్యక్షుడి పదవి రాష్ట్రానికి దక్కడం పట్ల ఉద్యోగ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. దీనిపై విద్యాసాగర్‌ మాట్లాడుతూ.. ఏపీ ఉద్యోగుల సమస్యలను జాతీయస్థాయిలో బలంగా వినిపిస్తానని చెప్పారు. ఇదే మహాసభల్లో ఎపీ ఎన్జీజీవో సంఘానికి చెందిన డీవీ రమణ, రాజ్యలక్ష్మి, శాంతి జాతీయ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. విద్యాసాగర్‌కు ఏఐఎస్‌జీఈఎఫ్‌ జాతీయ అధ్యక్షుడు సుభాష్‌ లాంభా, ప్రధాన కార్యదర్శి ఎ.కుమార్‌, ఏపీఎన్జీజీవో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జేఏసీ నాయకులు, వివిధ జిల్లాల కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియజేశారు.

Updated Date - Jan 28 , 2026 | 06:35 AM