ఏపీ జేఏసీ చైర్మన్‌గా విద్యాసాగర్
ABN , Publish Date - Feb 11 , 2026 | 04:14 AM
ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ను జేఏసీ సమావేశంలో సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు..
ఏకగ్రీవంగా ఎన్నుకున్న సభ్యులు
విజయవాడ(గాంధీనగర్), ఫిబ్రవరి 10(ఆంధ్రజ్యోతి): ఏపీ జేఏసీ చైర్మన్‌గా ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్‌ను జేఏసీ సమావేశంలో సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. విజయవాడలోని ఎన్జీవో హోంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఉద్యోగులు, పెన్షనర్లు, కార్మికుల సమస్యలపై చర్చించారు. అనంతరం విలేకరుల సమావేశంలో విద్యాసాగర్ మాట్లాడుతూ, అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగా పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 33 ఏళ్ల సర్వీస్ నిబంధనపై ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవగాహన లేని కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. జేఏసీ సెక్రటరీ జనరల్ ప్రసాద్, జేఏసీ డిప్యూటీ సెక్రటరీ జనరల్ డీవీ రమణ, నేతలు ఎం.రఘునాథరెడ్డి, జి.హృదయరాజు, బి.సాంబశివరావు పాల్గొన్నారు.