Share News

మాపై కేసులు కొట్టివేయండి

ABN , Publish Date - Feb 05 , 2026 | 04:32 AM

కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశామంటూ పల్నాడు జిల్లా యడ్లపాడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని...

మాపై కేసులు కొట్టివేయండి

  • హైకోర్టులో రజని, కాకాణి పిటిషన్లు

అమరావతి, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): కులాలు, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశామంటూ పల్నాడు జిల్లా యడ్లపాడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ మాజీ మంత్రి విడదల రజని, వైసీపీ నేతలు, కార్యకర్తలు 21 మంది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అలాగే కల్తీ నెయ్యి వ్యవహారంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేశానంటూ తనపై పొదలకూరు, నెల్లూరు దర్గామిట్ట పోలీసులు పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు.

Updated Date - Feb 05 , 2026 | 04:35 AM