శ్రీకూర్మం, అరసవల్లి క్షేత్రాలను దర్శించుకున్న ఉపరాష్ట్రపతి
ABN , Publish Date - Apr 28 , 2026 | 04:51 AM
శ్రీకాకుళం జిల్లాలో పుణ్యక్షేత్రాలను ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు...
శ్రీకాకుళం, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): శ్రీకాకుళం జిల్లాలో పుణ్యక్షేత్రాలను ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి శ్రీకూర్మంలో శ్రీకూర్మనాథ స్వామిని, అరసవల్లిలో శ్రీసూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం రామ్మోహన్‌నాయుడు ఇంటికి వెళ్లారు. దివంగత నేత, కేంద్ర మాజీమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడుతో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు.