రంగుల విదేశీ అతిథులు
ABN , Publish Date - Jan 26 , 2026 | 03:49 AM
ప్రతి ఏటా జనవరిలో వచ్చే విదేశీ అతిథుల కిలకిలవారాలు.. పచ్చని చెట్లపై రంగురంగుల పక్షుల సందడి! ఇది ఎక్కడో పక్షుల సంరక్షణ కేంద్రంలో కాదు..
ప్రతి ఏటా జనవరిలో వచ్చే విదేశీ అతిథుల కిలకిలవారాలు.. పచ్చని చెట్లపై రంగురంగుల పక్షుల సందడి! ఇది ఎక్కడో పక్షుల సంరక్షణ కేంద్రంలో కాదు.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం వెంకటాపురం గ్రామంలో కనిపించే కనుల విందైన దృశ్యం. ఎక్కడో సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ‘పెయిండెట్ స్టార్క్స్’ అనే పక్షులు ఈ గ్రామాన్ని దశాబ్దాలుగా తమ సురక్షిత విడిదిగా మార్చుకున్నాయి. జనవరి మాసంలో గ్రామానికి వచ్చే ఈ పక్షులు ఎత్తైన చెట్లపై గూళ్లు నిర్మించి, గుడ్లు పెడతాయి. మే-జూన్ నాటికి పిల్లలు పెద్దవయ్యాక తిరిగి వాటిని తీసుకొని వెళ్లిపోతాయి. ఈ పక్షులు ప్రధానంగా చేపలను ఆహారంగా తీసుకుంటాయి. దాహం వేసిన సమయంలో గ్రామంలోని ఇళ్ల వద్దనే అందుబాటులో ఉండే నీటిని తాగుతాయి. వేటగాళ్లు ఎవరూ గ్రామంలోకి రాకుండా.. గ్రామస్తులే రక్షణ కవచంగా నిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం కోతుల కారణంగా పక్షుల గుడ్లు నాశనమవుతున్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.