Share News

జగన్‌ను, వైవీ సుబ్బారెడ్డినీ తక్షణమే అరెస్టు చేయాలి

ABN , Publish Date - Feb 08 , 2026 | 05:09 AM

జగన్‌ ఐదేళ్ల పాలనలో తిరుమల లడ్డూ తయారీలో బాత్‌రూమ్‌ క్లీనింగ్‌ కోసం ఉపయోగించే రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు..

జగన్‌ను, వైవీ సుబ్బారెడ్డినీ తక్షణమే అరెస్టు చేయాలి

  • వీహెచ్‌పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్‌ బన్సాల్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ‘జగన్‌ ఐదేళ్ల పాలనలో తిరుమల లడ్డూ తయారీలో బాత్‌రూమ్‌ క్లీనింగ్‌ కోసం ఉపయోగించే రసాయనాలతో తయారు చేసిన నెయ్యిని వాడారంటూ ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దిగ్ర్భాంతిని, తీవ్ర మనోవేదనను కలిగిస్తున్నాయి’ అని విశ్వహిందూ పరిషత్‌ జాతీయ అధికార ప్రతినిధి వినోద్‌ బన్సాల్‌ అన్నారు. శనివారం ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. ‘హిందూ సమాజపు విశ్వాసాలు, నమ్మకాలు, పవిత్ర సంప్రదాయాలపై దీర్ఘకాలికంగా జరుగుతున్న వ్యవస్థీకృత దాడిని ఇది సూచిస్తోంది. దీనిని కేవలం పొరపాటుగా చూడలేం. ఇది ఉద్దేశపూర్వక హిందూ వ్యతిరేక మనస్తత్వాన్ని ప్రతిబింబిస్తోంది. మాజీ సీఎం జగన్‌, టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డిపై తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి అరెస్టు చేయాలి. మత విశ్వాసాలను అపవిత్రం చేసే వారి పట్ల ఉదాసీనత చూపకూడదు’ అని బన్సాల్‌ అన్నారు.

Updated Date - Feb 08 , 2026 | 05:10 AM