ప్రశ్న ముసుగులో విద్వేష ప్రచారం
ABN , Publish Date - Jul 09 , 2026 | 04:07 AM
ప్రశ్న ముసుగులో విద్వేష ప్రచారం, ప్రసంగాలు చేస్తున్న జోస్‌ఫ (రావణ్) లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని విశ్వహైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు..
విశ్వ హైందవ పరిషత్ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు
పిఠాపురం, జూలై 8(ఆంధ్రజ్యోతి): ప్రశ్న ముసుగులో విద్వేష ప్రచారం, ప్రసంగాలు చేస్తున్న జోస్‌ఫ (రావణ్) లాంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని విశ్వహైందవ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇటువంటి వ్యక్తులను సమర్థిస్తున్న గత ప్రభుత్వ పెద్దల తీరుని తీవ్రంగా ఖండించారు. మీకు హిందూ ధర్మం, దేవుళ్లు, దేవాలయాలంటే లెక్కలేదని మండిపడ్డారు. దేశ విద్రోహులు, మావోయిస్టులకు మద్దతుగా నిలుస్తున్న ఇటువంటి వ్యక్తులకు అండగా నిలుస్తారా? అని ప్రశ్నించారు.