Share News

AP Veterinary Council Chairman: పశువైద్య వృత్తిదారులకు మార్చి వరకు పాత ఫీజులే: వెటర్నరీ కౌన్సిల్‌

ABN , Publish Date - Jan 12 , 2026 | 06:29 AM

రాష్ట్రంలో పశువైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌కు ఈ ఏడాది మార్చి నెల వరకు పాత ఫీజులే కొనసాగుతాయని ఏపీ వెటర్నరీ కౌన్సిల్‌...

AP Veterinary Council Chairman: పశువైద్య వృత్తిదారులకు మార్చి వరకు పాత ఫీజులే: వెటర్నరీ కౌన్సిల్‌

అమరావతి, జనవరి11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పశువైద్య వృత్తిదారుల రిజిస్ట్రేషన్‌, రెన్యువల్‌కు ఈ ఏడాది మార్చి నెల వరకు పాత ఫీజులే కొనసాగుతాయని ఏపీ వెటర్నరీ కౌన్సిల్‌ చైర్మన్‌ పీవీ లక్ష్మయ్య సృష్టం చేశారు. సవరించిన కొత్త ఫీజులు ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తాయని ఆయన ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. పశువైద్య వృత్తిదారులైన ఇన్‌సర్వీస్‌, రిటైర్డ్‌, నిరుద్యోగ వెటరినరీ గ్రాడ్యుయేట్లు అందరూ మార్చి 31లోగా రిజిస్ట్రేషన్‌, రెన్యూవల్‌ చేసుకోవాలి. కాగా, వెటరినరీ గ్రాడ్యుయేట్లు అందరూ సకాలంలో రెన్యూవల్స్‌ పూర్తి చేసుకోవాలి అని సూచించారు.

Updated Date - Jan 12 , 2026 | 06:30 AM