మద్యం కేసులో ఐదు పిటిషన్లపై 27న తీర్పు
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:09 AM
మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు తొలిసారిగా సీజ్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి దాఖలైన ఐదు పిటిషన్లపై ఏసీబీ కోర్టు తీర్పును 27కి వాయిదా వేసింది.
విజయవాడ, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): మద్యం కుంభకోణంలో సిట్ అధికారులు తొలిసారిగా సీజ్ చేసిన రూ.11 కోట్లకు సంబంధించి దాఖలైన ఐదు పిటిషన్లపై ఏసీబీ కోర్టు తీర్పును 27కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డిని అరెస్టు చేసిన తర్వాత శంషాబాద్‌లోని సులోచన ఫాంహౌ్‌సలో భద్రపరిచిన రూ.11 కోట్లను సిట్ అధికారులు గత ఆగస్టులో సీజ్ చేశారు. దీనికి సంబంధించి కసిరెడ్డి దాఖలు చేసిన ఐదు పిటిషన్లపై బుధవారం వాద ప్రతివాదనలు ముగిశాయి. 27న తీర్పు వెలువరిస్తామని న్యాయాధికారి పి.భాస్కరరావు వెల్లడించారు.