వెంకట్రామిరెడ్డి గుండు డ్రామా
ABN , Publish Date - Jul 14 , 2026 | 04:15 AM
సాధారణంగా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోనపుడు, ఏళ్ల కొద్దీ పరిష్కరించకుండా జాప్యం చేసినపుడు ఉద్యోగులు నిరసన తెలుపుతారు. అదే ఏ ళ్ల నాటి సమస్యను పరిష్కరిస్తే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు.
10,715 ఉద్యోగులకు మేలు చేసిన వేళ నిరసన
జగన్ సర్కారు వేల కోట్ల బకాయిలు పెడితే నాడు ఎందుకు గుండు కొట్టించుకోలేదు?
ఓపీఎస్ అమలు చేయాలని ఎందుకు అడగలేదు?
ఇప్పుడు కూటమి మేలు చేస్తున్నా విషం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
సాధారణంగా ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోనపుడు, ఏళ్ల కొద్దీ పరిష్కరించకుండా జాప్యం చేసినపుడు ఉద్యోగులు నిరసన తెలుపుతారు. అదే ఏ ళ్ల నాటి సమస్యను పరిష్కరిస్తే హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తారు. కానీ, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగి కాని, ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ చైర్మన్‌గా చెప్పుకొనే వెంకట్రామిరె డ్డి తీరు ఇందుకు భిన్నంగా, చిత్రంగా ఉంది. 10,715 మంది సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్ విధానంలోకి మారేందుకు కూటమి ప్రభుత్వం అవకాశం ఇవ్వడం తో వారు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్న వేళ.. వెంకట్రామిరె డ్డి గుండు డ్రామాకు తెరతీశారు. గత ప్రభు త్వం ఉద్యోగులకు అన్యాయం చేసిన విషయాన్ని కప్పి పుచ్చేందుకు ప్రయత్నించారు. వెంకట్రామిరెడ్డి తీరు ఉద్యోగుల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమి సర్కార్ వచ్చిన నాటి నుంచి ఉద్యోగుల సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వస్తోంది. గత ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించకుండా పెండింగ్ పెట్టిన వేల కో ట్ల బకాయిలను రెండేళ్ల కాలంలో చెల్లింపులు చేసింది. నాడు జగన్ ప్రభుత్వం పరిష్కరించే అవకాశం ఉన్నా ఫైలును అటూ ఇటూ తిప్పుతూ కాలయాపన చేసిం ది. 10,715 మంది సీపీఎస్ ఉద్యోగుల విషయంలోనూ అన్యాయం చేసింది.
2004 సెప్టెంబరు 1 కంటే ముం దు జారీ అయిన ఉద్యోగ నియామక నోటిఫికేషన్ ద్వా రా ఆ తేదీన లేదా ఆ తర్వాత విధుల్లో చేరిన అర్హులై న ఉద్యోగులకు ఓపీఎస్ వర్తింపజేయకుండా మోసం చేసింది. 2019 ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి కూ డా మాట తప్పారు. కూటమి ప్రభుత్వం వీరిందరికీ ఓపీఎస్ అవకాశం కల్పిస్తూ సోమవారం జీవో జారీ చేసింది. దీంతో సీపీఎస్ ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో వెంకట్రామిరెడ్డి ఉద్యోగులకు అన్యాయం జరిగిపోతోందని ఆరోపణలు చేస్తూ గుండు కొట్టించుకున్నారు. ఉద్యోగులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు.
గత ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదేం?
గత ప్రభుత్వం ఉద్యోగులకు వేల కోట్ల బకాయిలు పెట్టింది. అప్పుడు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడుగా, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్‌గా ఉన్న వెంకట్రామిరెడ్డి దీని గురించి మాట్లాడలేదు. పైగా నాటి సీఎం జగన్ మెప్పు కోసం ఆయనకు అనుకూలంగా వ్యవహరించారు. వేల కోట్ల బకాయిలు చెల్లించకపోతే అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదని, ఎందుకు గుండు కొట్టించుకోలేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కూటమి సర్కార్ 10 వేల కుటుంబాలకుపైగా పెన్షన్ భరోసా కల్పించినపుడు ఇప్పుడు ఈ గుండు డ్రామా ఎందుకని అంటున్నారు. ఉద్యోగులను గత ప్రభుత్వం వేధించినప్పుడు, ఉపాధ్యాయులను బార్‌షాపుల వద్ద నిలబెట్టినప్పుడు, రివర్స్ పీఆర్సీ ఇచ్చినప్పుడు, జీవోలు ఇచ్చి డీఏ ఎరియర్స్ చెల్లించనపుడు.. ఇవన్నీ కనపడలేదా? అని ఉద్యోగులు, ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.
కూటమిపైనే ఎందుకీ విషం?
గత ప్రభుత్వం ఉద్యోగులను అన్నివిధాలా వేధించినపుడు మౌనంగా ఉన్న వెంకట్రామిరెడ్డి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్నా విషం కక్కుతున్నారు. ఉద్యోగులకు అన్యాయం జరిగిందని డ్రామాలు ఆడుతున్నారు. కూటమి సర్కార్ తమ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ వస్తోందని, చంద్రబాబు తమకు న్యాయం చేస్తారని ఉద్యోగుల్లో నమ్మకం ఉంది. అయితే ఏదో విధంగా ఉద్యోగులను ప్రభుత్వానికి దూరం చేయాలనే వెంకట్రామిరెడ్డి ఇలా చేస్తున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గతంలో తమకు మేలు చేసే అవకాశం ఉన్నా చేయకుండా, ఇప్పుడు జరిగే మేలును చెడగొట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు. గత ప్రభుత్వం ఏమీ చేయకున్నా పట్టించుకోని వెంకట్రామిరె డ్డి.. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు సానుకూలంగా చేస్తుంటే ఎందుకు విషం చిమ్ముతున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.
పాత బకాయిలు కలిపితే 50 వేల కోట్లు
ప్రభుత్వ ఉద్యోగం నుంచి డిస్మిస్ అయిన వెంకట్రామిరె డ్డి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్‌ను అంటూ తాడేపల్లిలో మాట్లాడారు. ఉద్యోగులు ఓటేసినందుకు నున్నగా గుండు చేసే పథకా న్ని రెండేళ్ల నుంచి ప్రభుత్వం అమలు చేస్తోందని విమర్శించారు. ‘నెలకు ఉద్యోగులకు చంద్రబాబు ప్ర భుత్వం చేసే క్షవరం రూ.1500 కోట్లు. పాత ప్రభు త్వ కాలంలోనివి పక్కనపెడితే ఈ రెండేళ్ల కాలంలో కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు పెట్టిన బకాయిలు కానీ, నష్టపోయినవి కానీ 32 వేల కోట్లు. ఉద్యోగుల కు అర్థమయ్యేలా చెప్పడానికే ఇలా బోడిగుండు కొట్టించుకున్నా. ఉద్యోగులను, వలంటీర్లను అందరికీ క్షవరం చేశారు. 5 డీఏలు పెండింగ్ ఉన్నాయి. డీఏ ఎరియర్స్ పెండింగ్ ఉన్నాయ్. గత ప్రభుత్వం 27 శాతం ఐఆర్ ఇచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చాక ఐఆర్ ఇవ్వలేదు. పాత ప్రభుత్వ పీఆర్సీ ఎరియర్స్, డీఏ ఎరియర్స్ పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కలుపుకొంటే ఉద్యోగులకు రావాల్సింది సుమారు రూ.50 వేల కోట్లు.’ అని అన్నారు.