Share News

పత్రికలపై భౌతిక దాడులు మంచిది కాదు

ABN , Publish Date - Apr 10 , 2026 | 04:20 AM

‘మీడియాలో వచ్చిన వార్తల పట్ల అభ్యంతరాలు ఉన్నప్పుడు నిరసన తెలియజేయవచ్చు. అంతేకానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికీ మంచిది కాదు...

పత్రికలపై భౌతిక దాడులు మంచిది కాదు

  • మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

చిత్తూరు సెంట్రల్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ‘మీడియాలో వచ్చిన వార్తల పట్ల అభ్యంతరాలు ఉన్నప్పుడు నిరసన తెలియజేయవచ్చు. అంతేకానీ భౌతిక దాడులకు పాల్పడడం ఎవరికీ మంచిది కాదు’ అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. గురువారం చిత్తూరులోని ఎన్‌పీ సావిత్రమ్మ మహిళా డిగ్రీ కళాశాల 44వ వార్షికోత్సవం జరిగింది. కార్యక్రమానికి హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘సమాజంలో ప్రతి ఒక్కరూ పత్రికలపట్ల బాధ్యతగా వ్యవహరించాలి. పత్రికలో ఏదైనా అసత్యకరమైన, అవమానకరమైన వార్తవస్తే ఖండించే అవకాశం ప్రజాస్వామ్యంలో ఉంది. నిరసన శాంతియుతంగా ఉండాలి’ అని పేర్కొన్నారు.

Updated Date - Apr 10 , 2026 | 04:20 AM