Share News

ఉత్తర్వులు, తీర్పులు తెలుగులోనే ఉండాలి

ABN , Publish Date - Feb 22 , 2026 | 05:07 AM

తెలుగు భాష పరిరక్షణ జరగాలంటే ప్రభుత్వఉత్తర్వులు, అసెంబ్లీ సమావేశాలు, న్యాయస్థాన తీర్పులు, వైద్యసేవల ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే అందించాలని...

ఉత్తర్వులు, తీర్పులు తెలుగులోనే ఉండాలి

  • కృత్రిమ మేధస్సుతో పాటు ఛందస్సూ తెలిసుండాలి: వెంకయ్య

విజయవాడ కల్చరల్‌, ఫిబ్రవరి, 21(ఆంధ్రజ్యోతి): తెలుగు భాష పరిరక్షణ జరగాలంటే ప్రభుత్వఉత్తర్వులు, అసెంబ్లీ సమావేశాలు, న్యాయస్థాన తీర్పులు, వైద్యసేవల ఉత్తర ప్రత్యుత్తరాలు తెలుగులోనే అందించాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని పొట్లూరి హరికృష్ణ, ఏపీ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ప్రపంచ కవుల మహాసభలు నిర్వహించారు. ఇందులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ ‘ప్రభుత్వ ఉద్యోగాలకు తెలుగు అర్హత తప్పనిసరి చేయాలి. అలాచేస్తే అందరూ సహజంగానే తెలుగు నేర్చుకుంటారు. మాతృభాషలో చదివినవారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రాధాన్యమివ్వాలి. మనుషులంతా కృతిమ మేధస్సుతో బాటు ఛందస్సు కూడా తెలిసి ఉండాలని, భాషాభిమానం కలిగి ఉండాలన్నారు.

Updated Date - Feb 22 , 2026 | 05:07 AM