Share News

వెలిగొండ నిర్వాసితులకు మరో 250 కోట్లు

ABN , Publish Date - Aug 22 , 2026 | 04:36 AM

వెలిగొండ ప్రారంభోత్సవానికి ముందే నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని ఇచ్చిన మాట ప్రకారం శనివారం మరో విడత నిధులను సీఎం చంద్రబాబు చెల్లించనున్నారు.

వెలిగొండ నిర్వాసితులకు మరో 250 కోట్లు

  • సీఎం క్యాంపు కార్యాలయంలో నేడు చెక్కుల పంపిణీ

అమరావతి, ఆగస్టు 21(ఆంధ్రజ్యోతి): వెలిగొండ ప్రారంభోత్సవానికి ముందే నిర్వాసితులకు పరిహారం చెల్లిస్తామని ఇచ్చిన మాట ప్రకారం శనివారం మరో విడత నిధులను సీఎం చంద్రబాబు చెల్లించనున్నారు. గురువారం రూ.200 కోట్ల చెక్కులను నిర్వాసితులకు అసెంబ్లీ ప్రాంగణంలో ముఖ్యమంత్రి అందజేశారు. శనివారం మార్కాపురం ప్రజా ప్రతినిధుల సమక్షంలో తన క్యాంపు కార్యాలయంలో ఇంకో రూ.250 కోట్లను నిర్వాసితులకు చంద్రబాబు అందజేస్తారు. వెలిగొండ నిర్వాసితులకు చెల్లించాల్సిన రూ.900 కోట్లలో నేడు ఇచ్చే నిధులుపోగా ఇంకా రూ.180 కోట్లు మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాటిని కూడా త్వరగానే చెల్లించేలా చర్యలు చేపడుతున్నట్లుగా అధికారులు వివరించారు.

Updated Date - Aug 22 , 2026 | 04:37 AM