గుంటూరులో వేగా జ్యుయలర్స్ ప్రారంభం
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:39 AM
రెండు తెలుగు రాష్ర్టాల్లో సుపరిచితమైన వేగా జ్యుయలర్స్ గుంటూరులోని లక్ష్మీపురం వద్ద నూతన ఆభరణాల షోరూంను ప్రారంభించింది.
కొనుగోలుదారులకు ప్రారంభోత్సవ ఆఫర్లు
గుంటూరు, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ర్టాల్లో సుపరిచితమైన వేగా జ్యుయలర్స్ గుంటూరులోని లక్ష్మీపురం వద్ద నూతన ఆభరణాల షోరూంను ప్రారంభించింది. ప్రముఖ సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గురువారం ఈ షోరూంను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేగా జ్యుయలర్స్ సంస్థ చైర్మన్ బండ్లమూడి రామ్మోహన్ రావు, మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుధాకర్ వనమాతోపాటు సినీ నటి డింపుల్ హయాతి, పలువురు నగర ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ నవీన్ వనమా మాట్లాడుతూ రాజధాని సమీప ప్రాంతంలో తమ షోరూం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. నూతన షోరూం ప్రారంభం, అక్షయ తృతీయను పురస్కరించుకుని ఈ నెల 16 నుంచి 26 వరకు తమ వేగ జ్యుయలర్స్ అన్ని షోరూంలలో ఖాతాదారుల కోసం అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నామని ప్రకటించారు. డైమండ్ ఆభరణాల ప్రతి క్యారట్ ప్రారంభ ధర రూ.49,999, 22 క్యారట్ హాల్ మార్క్ అన్ని బంగారు ఆభరణాలు పైన తరుగు (వేేస్టజ్) శాతం 5.99 నుంచి 12.99 శాతం వరకు మాత్రమే ఉంటుందని చెప్పారు. పాత బంగారు నగలు మారకం (ఎక్సేంజ్) పైన ప్రతి గ్రాముకు రూ.150 అదనంగా అందిస్తున్నామని ఈ ఆఫర్లను తమ అన్ని షోరూంలలో పొందవచ్చని ఆయన తెలిపారు. గుంటూరు షోరూం ప్రారంభం సందర్భంగా మొదటి వంద మంది కొనుగోలుదారులకు ప్రతి కొనుగోలు పైన ఒక బంగారు నాణెం ఉచితంగా ఇస్తున్నామని చెప్పారు. షోరూంలో నిర్వహించే లక్కీ డ్రాలో టాప్ ఐదుగురు ఖాతాదారులు రూ.రెండు లక్షల విలువైన బంగారు లేదా వజ్రాల హారం గెలుపొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఆఫర్లు కేవలం తమ గుంటూరు షోరూం నందు మాత్రమేనని స్పష్టంచేశారు.