Share News

వైభవంగా వీరబ్రహ్మేంద్రుడి రథోత్సవం

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:52 PM

పట్టణంలో శనివారం పోతులూరి వీరబ్రహ్రేంద్రస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది.

వైభవంగా వీరబ్రహ్మేంద్రుడి రథోత్సవం
అశేషజనవాహిని నడుమ సాగుతున్న రథోత్సవం

రథానికి పూజలు చేసిన

ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు

వేలాదిగా తరలివచ్చిన ప్రజలు

కిక్కిరిసిన పాతపేట రహదారులు

పత్తికొండ, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): పట్టణంలో శనివారం పోతులూరి వీరబ్రహ్రేంద్రస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. ఉత్సవాలలో భాగంగా మధ్యాహ్నం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రఽథాంగహోమం నిర్వహించారు. చెన్నకేశస్వామి దేవాలయం నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వరకు బ్రహ్మరథం లాగారు. సాయంత్రం ఆలయ కమిటీ నిర్వాహకులు మేళతాళాలలో రెడ్డిచావిడికి వచ్చి ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, సర్పంచ కొమ్ముదీపిక, తహసీల్దార్‌ హుసేనసాహెబ్‌లను రథోత్సవానికి ఆహ్వానించారు. ఎమ్మె ల్యే కేఈ శ్యాంబాబు కొబ్బరికాయకొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. అశేషజనవాహిని నడుమ ఆంజనేయస్వామి దేవాలయం నుంచి వడ్డేవారికట్ట తిరిగి చెన్నకేశవస్వామి దేవాలయం వరకు రథోత్సవం సాగింది. ఆనవాయితీగా ప్రజలు అరటిపండ్లను రథంపైకి వేసి మొక్కులు చెల్లించుకున్నారు. సీఐ జయన్న సిబ్బందితో బం దోబస్తు నిర్వహించారు.

ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

బ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో స్వామిని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ద ర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఆల య ధర్మకర్త ఎల్లారెడ్డి ఎమ్మెల్యేను సత్కరించారు. అంతకుముందు ఆలయ నిర్వాహక కమిటీ సభ్యులు దేవాలయ ఆర్చీనుంచి మేళతాళాలతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.

మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పూజలు

పత్తికొండ టౌన్‌: పట్టణంలోని మద్విరాట్‌ వీరబ్రహ్మేంద్రస్వామి రథోత్సవ వేడుకలకు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి శనివారం పాల్గొన్నారు. ముందుగా ఆలయంలో స్థానిక మాజీ ఎంపీపీ నాగరత్నమ్మతో కలిసి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రథం ముందు కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నారాయణదాస్‌, మేజర్‌ గ్రామ పంచాయతీ సర్పం చ్‌ కొమ్ము దీపిక, వైస్‌ సర్పంచ్‌ పల్లె కళావతి, వైసీపీ నాయకులు కొమ్ము నెట్టేకల్‌, శ్రీకాంత్‌రెడ్డి, మద్దికెర శ్రీను, రాతన మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2026 | 11:52 PM