వెదురుపాక విజయదుర్గ పీఠాధిపతి గాడ్ శివైక్యం
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:15 AM
తూర్పు గోదావరి జిల్లాలోని రాయవరం మండలం వెదురుపాకలోని విజయదుర్గా పీఠాధిపతి గాడ్ (90) శుక్రవారం రాత్రి విజయదుర్గా పీఠంలో శివైక్యం పొందారు.
రాయవరం, జూన్5 (ఆంధ్రజ్యోతి) : తూర్పు గోదావరి జిల్లాలోని రాయవరం మండలం వెదురుపాకలోని విజయదుర్గా పీఠాధిపతి గాడ్ (90) శుక్రవారం రాత్రి విజయదుర్గా పీఠంలో శివైక్యం పొందారు. 1936 జనవరి 19న జన్మించిన గాడ్ 1972 ఆగస్టు 18న ఎదురుపాకలో విజయదుర్గా పీఠాన్ని స్థాపించారు. 1989లో శృంగేరి పీఠాధిపతుల చేతుల మీదుగా విజయదుర్గ అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించారు. సుమారు 54 సంవత్సరాల పాటు ఉభయ తెలుగు రాష్ర్టాలతోపాటు దేశ విదేశాల్లో తన ఆధ్యాత్మిక బోధనలతో భక్తులను ఆకట్టుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు తీవ్ర దిగ్ర్భాంతికి లోనయ్యారు. పలువురు భక్తులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు.