వేదవతి ఎత్తిపోతలకు కదలిక
ABN , Publish Date - Jun 13 , 2026 | 06:20 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వేదవతి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి
డీపీఆర్ తయారీ బాధ్యత వాప్కోస్
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వేదవతి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గుల్యం గ్రామం వద్ద వేదవతి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జలసంఘం మార్గదర్శకాల ప్రకారం డీపీఆర్ తయారుచేసే బాధ్యతను వాప్కోస్ కు అప్పగిస్తూ జలవనరులశాఖ ఉత్తర్వులు జారీచేసింది. డీపీఆర్ వచ్చాక నిధుల విడుదలపై దృష్టి సారిస్తుంది. 80వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి ఉద్దేశించిన ఈ పథకానికి అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు సాధించే బాధ్యతను వాప్కో్‌సకే అప్పగించారు.