రెండేళ్లలో ‘వేదవతి’ పూర్తి: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Jun 11 , 2026 | 04:59 AM
రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 36 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో కర్నూలు జిల్లాలోని వేదవతి లిఫ్ట్ స్కీం కూడా ఉందని, దీన్ని 2028 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని..
అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన 36 ప్రాధాన్య ప్రాజెక్టుల్లో కర్నూలు జిల్లాలోని వేదవతి లిఫ్ట్ స్కీం కూడా ఉందని, దీన్ని 2028 నాటికి పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. బుధవారం విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో కర్నూలు జిల్లా నేతలతో నిమ్మల సమావేశమయ్యారు. జిల్లాలో 68 ట్యాంకుల పథకంలో భాగమైన జొన్నగిరి ట్యాంకుకు పైప్‌లైన్ నిర్మాణంపై అంచనాలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. గురురాఘవేంద్ర ప్రాజెక్టుకు మరమ్మతుల కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించి, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలకు సాగు, తాగునీరు అందించేలా చర్యలు చేపట్టాలన్నారు.