భారతీయ సంస్కృతికి మూలం వేదాలు: జస్టిస్ లక్ష్మణరావు
ABN , Publish Date - Jan 05 , 2026 | 04:43 AM
భారతీయ సంస్కృతికి మూలం వేదాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణ రావు తెలిపారు.
తణుకు రూరల్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): భారతీయ సంస్కృతికి మూలం వేదాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణ రావు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా దువ్వ గ్రామంలోని శ్రీ పర్వతవర్దని సమేత శ్రీ నాగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం 17వ వేద సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదపండితులను సత్కరించడం అభినందనీయమన్నారు. అనంతరం వివిధ ప్రాంతాలకు చెందిన వేద పండితులతో పాటు జస్టిస్ లక్ష్మణరావు దంపతులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ సత్కరించారు.