Share News

వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి

ABN , Publish Date - Feb 20 , 2026 | 11:39 PM

గ్రామీణ పేదల పొట్ట కొట్టే వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని కొనసాగిం చాలని అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనిరాజు డిమాండ్‌ చేశారు.

 వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి
మాట్లాడుతున్న గనిరాజు

అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనిరాజు

ఆదోని అగ్రికల్చర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ పేదల పొట్ట కొట్టే వీబీజీ రాంజీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని కొనసాగిం చాలని అఖిల భారత రైతుకూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గనిరాజు డిమాండ్‌ చేశారు. శుక్రవారం స్థానిక కార్యాలయంలో రైతుకూలీ సంఘం ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా గ్రామీణ పేదలకు ఉపాధి కల్పిస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉ పాధి చట్టాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ఏకపక్షంగా రద్దు చేయ డం దుర్మార్గమన్నారు. వికసిత భారత గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గర్‌ అండ్‌ అజివీక మిషన తీసుకువచ్చిందని, దీంతో కోట్ల మంది వ్యవసాయ కూలీలు ఈ పథకానికి దూరమయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గత 11 ఏళ్లు ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చేం దుకు కేంద్రం కంకణం కట్టుకుందని విమర్శించారు. వంద రోజుల పని కల్పించలేని పాలకులు నేడు 125 రోజుల పని కల్పిస్తామని ప్రకటించడం కుట్రలో భాగమన్నారు. రాష్ట్రాల పై భారాన్ని మోపి కేంద్రం తన బాధ్యత నుంచి తప్పుకోవడానికి ప్రయత్నిస్తుందన్నారు. పోరాటాల ద్వారా ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఏఐకేఎంఎస్‌ ఉమ్మడి జిల్లా కార్యదర్శి సత్యనారాయణ, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బాలరాజు, పట్టణ కార్యదర్శి బాబు, హనుమంతు, రాజు, వినోద్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 20 , 2026 | 11:39 PM