పేలుడుపై రాష్ట్రపతి, ప్రధాని దిగ్ర్భాంతి
ABN , Publish Date - Mar 01 , 2026 | 05:50 AM
బాణసంచా పేలుడు సంఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్రపతి ఎక్స్‌లో స్పందించారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు.
మృతుల కుటుంబాలకు పీఎం 2 లక్షల ఎక్స్‌గ్రేషియా
క్షతగాత్రులకు 50 వేలు
బాధితులను పరామర్శించిన డిప్యూటీ సీఎం పవన్
న్యూఢిల్లీ, అమరావతి, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): బాణసంచా పేలుడు సంఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈమేరకు రాష్ట్రపతి ఎక్స్‌లో స్పందించారు. ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ స్పందించారు. ‘గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. మరణించిన వారికి కుటుంబాలకు రూ.2 లక్షలు వంతున, గాయపడిన వారికి రూ.50 వేల వంతున పరిహారాన్ని పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి ఇస్తాం’ అని ప్రకటించారు. ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందిస్తూ, వేట్లపాలెం సంఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందిస్తూ... బాణసంచా తయారీ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడినందునే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అని అన్నారు.